ఆనందం

సుఖము, సంతోషము,ఆనందము అనేవి నిజానికి వేరు వేరు, కాని ఈ మూడూ ఒకటేనని మనిషి పోరపడుతుంటాడు.

సుఖం అనేది ఇంద్రియ లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసేపదం, ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది

సంతోషం అనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలసోచ్చినప్పుడో మనసు ఉత్తెజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరంకుడా చురుగ్గా, వుల్లాసంగా ఉంటుంది.

ఈ రెండింతికన్నా ఉన్నతమైనది ఉదాత్తమైనది ఆనందం
శారీరక, మానసిక, ఆద్యాత్మక కక్ష్యలు ముడింటికి సంతృప్తిని కూర్చే గొప్ప స్థితి
ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కపెట్టిన వారికీ ఆనందమయ స్థితి వారంగా లభిస్తుంది
" ఆనందమనేది ఏమేమి పొందామన్న దానికన్నా ఏమేమి వదులుకోగాలిగామన్న దానిపై ఆధారపడుతుంది నిత్యం దుఖంలో నానుతూ ఉండే మనిషి ఆనందాన్ని పంచలేదు, నిరంతరం ఆనందంగా ఉన్నవాడు మాత్రమే చుట్టూ ఉండేవారికి తరువాతి తరానికి సైతం తన జీవ లక్షణమైన ఆనందాన్ని అందించగలడు.
SOURCE: EENADU

27
May 2008
POSTED BY SATiSH
POSTED IN
DISCUSSION